పవన్ కల్యాణ్ కంటికి ఇన్ఫెక్షన్., మళ్లీ ఆపరేషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు పవన్ కల్యాణ్ గురువారం మరోసారి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. పవన్ కల్యాణ్ గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో జూన్ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. టెస్టులు చేసిన ఆస్పత్రి వైద్యులు పవన్ ఎడమ కంటిలో చిన్న కురుపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు.అయితే ఏపీలో పవన్ ప్రజా పోరాట యాత్ర చేపట్టడంతో శస్త్ర చికిత్స లేటు చేశారు. కంటిలో దుమ్ము దూళి పడకుండా నల్ల కళ్ళద్దాలు వాడేవారు. అయినప్పటికీ కంటి నొప్పి క్రమేణా పెరగడంతో జులైలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎడమ కంటిలోని కురుపును తొలగించారు. అనంతరం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కానీ శస్త్ర చికిత్స తర్వాత కూడా ప్రజా పోరాట యాత్ర కొనసాగించడంతో పవన్ కు విశ్రాంతి లేకుండా పోయింది. డాక్టర్లు చెప్పినట్లు తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఇవాళ మరోసారి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సారైనా తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు పవన్ కల్యాణ్ కు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here