యనమల పంటి చికిత్స బిల్లు 2.88 లక్షలేనట

ఇండియాలో రూ. వేలల్లో అయ్యే రూట్ కెనాల్ చికిత్సకు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు గారు సింగపూర్ వెళ్లి లక్షలు వెచ్చించడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఒకప్రక్క ఏపీ డబ్బు లేదని బీదరుపులు అరుస్తోన్న ప్రభుత్వం.., ఈ రకంగా మంత్రిగారి పంటి చికిత్సకు మాత్రం లక్షలు ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ గురువారం విడుదల చేసిన జీవో ప్రకారం.., ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఏడాది ఏప్రిల్ 12న సింగపూర్ లోని 22 సిక్స్త్ అవెన్యూలోని అజురే డెంటల్ హాస్పిటల్ లో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. ఇందుకు గానూ రూ.2,88,823 ఖర్చైనట్లు బిల్లులు సమర్పించారు. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈ జీవో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియాలో రూట్ కెనాల్ చికిత్స చేయడం మానేశారా? అని కొందరు, రూట్ కెనాల్ చేయించడానికి మంత్రి సింగపూరే వెళ్లాలా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం మంచిది కాదని మరికొందరు…, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మంత్రివర్యులు ఏం సమాధానం ఇస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here