టిటిడిలో ఏఈవోపై లైంగిక వేధింపుల కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం లో లైంగిక వేధింపుల విషయం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.టిటిడి నిర్వహిస్తున్న శ్రీనివాసమంగపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఏఈవో శ్రీనివాసులుపై తితిదే మహిళా ఉద్యోగి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా వారు ఏఈవోకు భయపడి పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొంది. బాధితురాలు, టీటీడీ ఉద్యోగిని కూతురు ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ మా అమ్మ ఎస్ఆర్ లో నాపేరు చేర్చడానికి ఏఈవో నన్ను వేధిస్తున్నాడని, తన కోరిక తీర్చమంటున్నాడని, ఆపని చేయకపోతే మా అమ్మను వేరే రాష్ట్రానికి పంపుతానంటున్నాడని ఆమె చెప్పారు. టీటీడీ ఉన్నతాధికారులకు ఎన్నిసారు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు ప్రభావతి వాపోయింది.ఏఈవో తనకు ఫోన్లో చేసిన బెదిరింపులు, కామ కోరికల వేధింపుల కాల్స్ ను ఆమె పోలీసులకు అందించింది. కాగా ఏఈవో పై ఇదివరకు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అందుకే అతణ్ని శ్రీనివాస మంగాపురానికి బదిలీ చేశారని టిటిడి వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here