కురుక్షేత్ర యుద్ధం తర్వత ఓ మహనీయుడు ఇంకా బతికే ఉన్నాడా…!! ఇదో సాక్ష్యం అంటోన్న ఆ ప్రాంత ప్రజలు..!

కురుక్షేత్ర యుద్ధం మొదలు పెట్టడానికి ముందు శ్రీ కృష్ణ భగవానుడు జీవి జనన మరణ వివరాలను అర్జునుడుకి భోదిస్తూ… “పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు” అని స్వయంగా చెప్పాడు.. భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన ఆయుస్సు తీరగానే మరణించక తప్పదు.. దీనికి ఏ జీవి అతీతం కాదు…సాక్షాత్ భగవత్ స్వరూపమైన రాముడు, శ్రీ కృష్ణుడు వంటి వారు కూడా కూడా తమ ఆయుస్సు తీరగానే మృత్యువు దరిచేరింది.. అయితే మన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి, పరశురాముడు, విశ్వామిత్రుడు, అశ్వద్ధామ వంటి మహనీయులు ఇంకా భూమి మీద బతికే ఉన్నారు.. అయితే వీరు బతికే ఉన్నారు.. ఇప్పటికీ అదృశ్య రూపంలో తిరుగుతున్నారు అని మనం పురాణాల్లో చదువుకొవడం తప్ప… వీరి జాడ ఇప్పటి వరకూ మనకు కనిపించలేదు.. ఎవరూ చూసిన దాఖలాలు లేదు.. అయితే మన ఆధ్యాత్మిక వేత్తలు వారు మహాపురుషులు… మనం సామాన్య మానవులం.. కనుక మనకు కనిపించరు.. అదృశ్య రూపంలో తిరుగుతుంటారు.. కలియుగ పురుషుడు కల్కి భగవానుడు ఈ భూమిపై అవతరించినప్పుడు ఆయనకు సహాయం చేయడానికి వారు భూమి మీద ఉన్నారు.. చెబుతుంటారు. అయితే వీరు ఇప్పటికీ హిమాలయాల్లో, కీకారణ్యంల్లో తిరుగుతూ .. భగవన్నామస్మరణ చేస్తుంటారు అని కొంత మంది చెబుతుంటారు. గత కొన్ని ఏళ్ల క్రితం.. హిమాలయాల్లో ఆంజనేయ స్వామీ మేము చూసాం… ఆయన ఇప్పటికీ ఉన్నారు.. ఇదిగో సాక్ష్యం అంటూ… ఫోటో ఒకటి హల్ చల్ చేసింది. అయితే ఈ చిరంజీవుల్లో మరొకరు.. ఉత్తర ప్రదేశ్ లోని ఒక అటవీ ప్రాంతంలో కొందరు మేము చూశామని.. అతను మహాభారత కాలం నాటి వ్యక్తి అని.. ద్వాపరయుగము నుంచి అతను అతను బతికి ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. మరి అక్కడ అడవుల్లో సంచరిస్తున్న వ్యక్తీ ఎవరు..? ద్వాపర యుగం ముగిసి ఇప్పటికే 5౦౦౦ వేల ఏళ్ళు ముగిసిందని మన గ్రంధాలు చెబుతున్నాయి. మరి మనిషి జీవిత కాలం మహా అయితే 100 ఏళ్ళు.. అనుకుంటే.. 5000 వేల ఏళ్ల నుంచి ఓ వ్యక్తి సజీవంగా బతకడం సాధ్యమా..? ఒక వేళ మహనీయులు బతకడం సాధ్యమైతే.. అక్కడ అడవుల్లో సంచరిస్తున్న మహనీయుడు ఎవరు..? తెలుసుకుందాం…

ఉత్తర్ ప్రదేశ్ లోని లకింపూర్ అనే ఉరికి దగ్గర ఉన్న అడవుల్లో ఉన్న ఒక శివాలయం ఈ వింతకు నెలవైంది. అక్కడ కొంత మందికి కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. అశ్వద్ధామ… కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ. ఈయన చిరంజీవి.. మహా శివభక్తుడు.. ద్వాపర యువ కాలంలో ఈయన శివుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి తాను ఎప్పుడు తలిస్తే అప్పుడు మాయం అయ్యే శక్తిని వరంగా పొందాడు. కురుక్షేత్ర యుద్ధం పాండవుల కారణంగా తన తండ్రి ద్రోణాచార్యుడు మరణించాడని అశ్వద్ధామ పగతో రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఆఖరి రోజు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అర్ధరాత్రి పాండవుల శిబిరం పై అశ్వద్ధామ దాడి చేసి ఉపపాండవులను చంపేశాడు.. అంతటితో ఆగకుండా అర్జునుడి కొడుకు అభిమన్యుడు భార్య ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తుడిని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీ కృష్ణుడు ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడు కొడుకును కాపాడాడు.. అనంతరం కృష్ణుడు అశ్వద్ధామను శపిస్తూ.. చిరంజీవి వైన నీవు పాప భరితమైన కలియుగంలో వారి పాపాలను చూస్తూ… కురూపిగా జీవిస్తావు అని చెప్పాడు. ఆ శాపంతో కురుపిగా మారిన అశ్వద్ధామ.. తన రూపం ఎవరికీ కనిపించకుండా మయా రూపంలో తిరుగుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అశ్వద్ధామ లకింపూర్ సమీపంలో అదృశ్య రూపంలో తిరుగుతూ ఇదిగో ఈ గుడిలో శివుడి విగ్రహానికి పూజ చేస్తున్నాడని అక్కడ ప్రజలు చెబుతున్నారు. గుడికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఆ ఆలయంలోని శివలింగాన్ని ద్రోణాచార్యుడు స్వయంగా ప్రతిష్టించాడట.. ద్వాపర యుగ సమయంలో అక్కడ ద్రోణాచార్యుడు ఆశ్రమం ఉండేదని మహా శివభక్తుడు అయిన ఆయన రోజు ఆ శివలింగాన్ని పూజించే వాడని… ఆశ్రమంలో ఉన్న సమయంలోనే అశ్వద్ధామ జన్మించాడట. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ.. అశ్వద్ధామ కూడా మహా శివభక్తుడు గా మారాడని అంటారు. తన తండ్రి ప్రతిష్టించిన శివలింగాన్ని ఇప్పటికి రోజు అశ్వద్ధామ తెల్లవారు జామునే వచ్చి ఆ లింగానికి పూజలు చేస్తున్నాడని అక్కడ వారు చెబుతున్నారు. పూర్వం అది ద్రోణాచార్యుని ఆశ్రమం అయినా కాలక్రమేనా అది శివాలయంగా మారిందని… రోజు తెల్లవారు జామున మాయారూపంలో అశ్వద్ధామ శివాలయం వద్దకు వచ్చి లింగానికి పూజ చేసి మళ్ళీ ఆ అడవుల్లోకి వెళ్లి మయం అవుతాడని అక్కడ ప్రజలు చెబుతున్నారు. అందుకు సాక్ష్యంగా ఆ గుడిలో చోటు చేసుకునే వింతను చూపిస్తున్నారు. ఇంతకీ ఆ వింత ఏమిటంటే… రోజు రాత్రి గుడి మూసే ముందు శివలింగాన్ని శుభ్రం చేసి.. పూల మాల వేసి.. గుడి తాళం వేసి పూజారి వెళ్లి పోతాడట… మళ్ళీ ఆ పూజారి మర్నాడు గుడి తలుపు తెరచి చూస్తే.. శివలింగం అంతా తడిగా ఉండి.. శివ లింగం పై పూలు చెల్లాచెదురుగా ఉంటాయట.. వేసిన తలుపు వేసినట్లే ఉంటాయి.. కానీ శివలింగానికి రాత్రి చేసిన అలంకారం.. పొద్దున్న తలుపులు తీసే సమయానికి ఉండదు.. ఆ గుడి చుట్టుపక్కల రెండు మైళ్ళ దూరం వరకూ ఒక్క ఇల్లు కూడా ఉండదు.. అలాంటి చోట ఇటువంటి సంఘటన ఒక వింత అని చెబుతుంటే.. ఈ పని ఒక్క అశ్వద్ధామ వల్లే అవుతుందని.. అక్కడ
వారి నమ్మకం.. ఐతే నిజంగా మనపురాణాల్లో చెప్పినట్లు అశ్వద్ధామ చిరంజీవి కనుక ఆయన బతికే ఉన్నాడా..? అనేది ఒక వింత అయితే… మరో వింత నిత్యం ఈ గుడిలో జరిగే సంఘటన.. ఎప్పటికైనా ఆ మిస్టరి వెనుక ఉన్న హిస్టరీ వెలుగులోకి వస్తుందేమో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here