ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత “జనజాగృతి” పార్టీని స్థాపించారు. శుక్రవారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె ఈ ప్రకటన చేశారు. మార్పుకోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని కొత్తపల్లి గీత చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గుడుగు చిహ్నాన్ని ముద్రించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ, తాను డిప్యూటీ కలెక్టర్ గా పని చేశానని, నాలుగన్నరేళ్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నానని, విద్యార్థి దశ నుంచే సామాజిక సృహతో ఉన్నానని ఆమె చెప్పారు. గిరిజన ప్రాంత సమస్యలని పార్లమెంట్ లో ప్రస్తావించానని చెప్పారు. రాజకీయ పార్టీలున్నది ప్రజలకోసమేనని కొత్తపల్లి గీత అన్నారు.2014లో వైసీపీ తరుపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత, కొన్నాళ్లుగా ఆపార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. ఒకదశలో గీత టీడీపీ లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ సడెన్ గా కొత్తపల్లి గీత రాజకీయ పార్టీని స్థాపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here