ఏ క్షణమైనా ఎన్నికలు వస్తాయి-సిద్ధంగా ఉండండి: కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోయారు. ఏ క్షణమైనా ఎన్నికలు వస్తాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగుల్లో చాలామందికి టికెట్లు ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చిన కేసీఆర్.., ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయాన్ని తనకు వదిలేయాలని చెప్పారు. హైదరాబాద్ లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, సెప్టెంబర్ 2న జరిగే “ప్రగతి నివేదన సభ” కు నియోజకవర్గం నుంచి కనీసం 25 వేల మందిని తీసుకురావాలన్నారు. తెలంగాణలో గత కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికల వేడి కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రే ఇచ్చిన స్పష్టతతో తెలంగాణలో రాజకీయ రణరంగం మరింత ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితి ఊహించి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పార్టీ అధినేత రాహూల్ గాంధీ ని తెలంగాణకు తీసుకువచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు, పొత్తుల దిశగా రాష్ట్ర రాజకీయాలు పరుగులు పెట్టనున్నాయి. టికెట్లు కోరుకుంటున్న ఆశావహులు ఇక రాజధాని హైదరాబాద్ లో మకాం వేయడానికి సిద్ధమైపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here