జీవీఎల్ కారు ఢీకొని మహిళ మృతి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లా కొలనుకొండలో శుక్రవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొంది. వీరిలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది.గాయపడిన మహిళను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జీవీఎల్ కారులోనే ఉన్నారు. కానీ బాధితులతో మాట్లాడకుండా అక్కడనుంచి మరోకారులో పలాయనం చిత్తగించి విజయవాడకు జారుకున్నారు. దీనిపై బాధితులు, స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు ప్రజల ప్రాణాలంటే విలువలేకుండా పోతుందని జనం మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జీవీఎల్ కారు డ్రైవరును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here