కొబ్బరి నూనె ఆరోగ్యానికి హానికరమట…!!

భారతీయులలో కొబ్బరినూనెకు అమితమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరి నూనె తెలుగు రాష్ట్రాల్లో తలకు పెట్టుకుంటారు.. అదే కేరళలో వంట నూనెగా ఉపయోగిస్తారు. కేరళ వాసులు దీన్ని సర్వరోగనివారిణిగా భావిస్తుంటారు. అయితే తాజాగా హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన ప్రొఫెసర్ కరీన్ మిచెల్ మిషెల్స్ కొబ్బరి నూనె విషతుల్యమైన ఆహారం అని హెచ్చరిస్తున్నాయి. ప్రొఫెసర్ ఇటీవల యునివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్ లో “కోకోనట్ ఆయిల్ అండ్ నేచురల్ ఎర్రర్స్ అనే అంశంపై.. ప్రసంగించారు. కొబ్బరి నూనెలో ఉండే సంత్రుప్త కొవ్వు ఆమ్లాలు శరీరానికి హానికరం చేస్తాయని చెప్పారు. ఈ కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ గా మారుతుందని ప్రొఫెసర్ మిషెల్ తెలిపారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశోధనలద్వారా తెలిసినట్లు ఆమె చెప్పారు. అందుకని కొబ్బరి నూనె వంటలను ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్స్ స్పష్టం చేశారు.

కొబ్బరి నూనె వివిధ వంటకాలలో ఉపయోగించడం సర్వసాధారణం. ఈ నూనెను ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తున్న తరుణంలో ప్రొఫెసర్ కరీన్ మిషెల్స్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన పరిశోధనలలో కొబ్బరినూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు కార్డియోవాస్క్యులర్ వ్యాధిని నియంత్రించడంలో తోడ్పడుతాయని తెలిపారు. ఈ సమయంలో ప్రొ మిషెల్స్ ప్రకటన కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here