క్యాన్సర్ లో అత్యంత ప్రమాద కరం లంగ్ క్యాన్సర్… లక్షణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7.6 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రొమ్ము, పెద్దప్రేగు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్ లు ఉన్నా… ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల మరణించే వారే అధికం అని ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ వారి అధ్యయనంలో తెలిసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు క్యాన్సర్ మరణాల్లో దాదాపుగా ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వలనే అని అంచనా వేయబడింది. ఐతే ఈ వ్యాధి ధూమపానం చేసే వారికి లేదా కలుషిత ప్రాంతంలో నివసించే వారికే వస్తుంది అని చాలా మంది భావిస్తారు.. కానీ ఊపిరి తిత్తుల క్యాన్సర్ సోకడానికి అనేక కారకాలు ఉన్నాయి.. ఇక ఇటీవల అమెరికన్ క్యాన్సర్ సొసైటి వారు ఊపిరి తిత్తుల క్యాన్సర్ కలిగిన వారిలో 20శాతం ఎటువంటి చెడు అలవాట్లు లేనివారిగా గుర్తించారు. ధూమపానం చేయనివారికి కూడా ఈ వ్యాధి ఇతర కాలుష్య పొగల కారణంగా, పర్యావరణ నాశన కారకాలు లేదా జన్యు ఉత్పరివర్తనలు, వాహనాలు వెదజల్లే కాలుష్యం మొదలైన వాటి ద్వారా ఊపిరి తిత్తుల క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. ప్రాణాలను హరించే ఈ ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు తెలుసుకుంటే… ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు… ఇక అమెరికాలో క్యాన్సర్ బారిన పడుతున్న రోగుల్లో 14 శాతం మంది ఊపిరితిత్తులు క్యాన్సర్ బాధితులే…
ఐతే ఈ వ్యాధి మొదట్లోనే గుర్తిస్తే… నివారణ సులభమని…. ఆయుస్సును పొడిగించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సర్వసాధారణంగా జలుబు లేదా ఇతర శ్వాస సంబంధ రోగాలు దగ్గు రావడానికి కారణం.. అయితే ఇటువంటి దగ్గు ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గిపోతుంది. అలా రెండు మూడు వారాల్లో దగ్గు తగ్గకుండా ఇంకా నెలల తరబడి కొనసాగితే… ఆరోగ్య పరిస్థితి గురించి అలోచించాల్సిందే…
ఇక పదేపదే జలుబు చేస్తుంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి… అప్పుడు ఎక్స్ రె, రక్త, ముత్ర పరీక్ష చేసి.. వ్యాధిని నిర్ధారించి నివారణ కోసం సరైన చికిత్స ను చేస్తారు.
శ్వాసలో మార్పును చోటు చేసుకుంటే… ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణం అని కూడా ఒక్కొక్కసారి అనుకోవచ్చు.. ముఖ్యం నిద్రలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, నిద్రలో తీవ్రమైన గురక మొదలైన సమస్యలు కూడా ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలు అని అంటున్నారు. అంతేకాదు కొన్ని శ్వాసకోశ సంబంధిత అలర్జీల కారణంగా కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల పరంగా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా, నిర్లక్ష్యం వహించరాదు. జలుబు, ఆస్థ్మా వంటి తెలిసిన వ్యాధులు లేని పక్షాన కూడా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే, వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల్లో మరొకటి తరచూ తలనొప్పికి గురి అవుతుండటంమెడ మరియు ముఖం వాపు లక్షణాలతో పాటు.. కాళ్ళు మరియు చేతుల యొక్క మునివేళ్ళ వాపు వస్తుంటాయి
అంతేకాదు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్వరపేటిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కనుక గొంతులోని నరాలు ఇబ్బందిగా అనిపించి క్రమంగా అసౌకర్యానికి లోనవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, ఎవరికైనా మాటలలో మార్పు చోటు చేసుకుంటుంది.. దీనిని బొంగురు గొంతు లేదా హోర్స్ వాయిస్ అని వ్యవహరిస్తారు. రెండు వారాల కంటే ఈ సమస్య ఎక్కువుగా ఉంటె… వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..
ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా వేగంగా బరువు తగ్గుతుంటే అది ఊపిరి తిత్తుల క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా అనుమానించాల్సిందే…
ఎముకలు, కీళ్ళ నొప్పులు, వెన్నులో లేదా నడుమ భాగంలో నొప్పి ముఖ్యంగా రాత్రి నిద్ర పోతున్న సమయంలో ఈ నొప్పులు అధికం అవుతుంటే… అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం అని భావించ వచ్చు. వీటిల్లో ఏవైనా సంకేతాలు లేదా లక్షణాలు, నిరంతరంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ను సంప్రదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here