లాలూకు హైకోర్టులో చుక్కెదురు

ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. మరో మూడు నెలల పాటు తన పెరోల్ ను పొడిగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఆగస్ట్ 30వ తేదీలోపు తిరిగి జైలుకు రావాలంటూ హైకోర్టు ఆదేశించింది. తన హయాంలో జరిగిన దాణా స్కాం లో నిందితుడుగా తేలిన లాలూ.., ఆ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం పెరోల్ ను మరో మూడునెలల పెంచాలని లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి ఆప్రేశ్ కుమార్ తిరస్కరించారు. ఒకవేళ అదనపు చికిత్స కావాలంటే, ఆయన్ను రాంచీ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here