ప్రధాని మోదీకి జగన్-పవన్ జోడెద్దులుగా మారారు:జూపూడి

ప్రధాని నరేంద్రమోదీకి జగన్-పవన్ జోడెద్దులుగా మారారని టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పిన తర్వాత కూడా జగన్-పవన్ లు బీజేపీతో కలసి ఎందుకు నడుస్తున్నారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ హవా ఇసుమంతైనా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు.దేశంలోని అన్ని రాష్ట్రాలలో పీడీ అకౌంట్లను నిర్వహిస్తున్నారని,ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదని అన్నారు. కానీ పీడీ అకౌంట్లపై బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీడీ అకౌంట్లలో అవినీతి జరిగే ఆస్కారమే లేదని జూపూడి ప్రభాకర్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here