రాఫెల్ కుంభకోణంపై బీజేపీ విచారణ కోరాలి: మంత్రి ఆనందబాబు

బీజేపీ నేతలకు దమ్ముంటే రాఫెల్ కుంభకోణంపై సిబిఐ విచారణ కోరాలి. దాంతోపాటు గుజరాత్ బాండ్ల పైన, దేశంలో పీడీ అకౌంట్లపై సిబిఐ విచారణ కోరాలి. బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ మెడకు ఎలా చుట్టుకుందో, రాఫెల్ కుంభకోణం నరేంద్రమోదీ కి అలానే చుట్టుకుంది. గుజరాత్ ప్రభుత్వం 10.7 శాతం వడ్డీతో బాండ్లు జారీ చేస్తే.., ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10.3 శాతం వడ్డీకే బాండ్లు జారీచేసిందని, ఇది ఎలా అప్పులపాలు అవుతుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల దృష్టి మరల్చడానికే, కుట్ర చేస్తున్న బీజేపీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూర్చడానికే టీడీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఎందుకూ చెల్లనటువంటి, ఎవరికీ తెలియని నేతలు, కౌన్సిలర్ గా కూడా గెలవలేని వారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు సంవత్సరాలు కలసి ఉన్నప్పుడు కనపడని అవినీతి, మేము బయటకు రాగానే బీజేపీ నాయకులకు అవినీతి కనపడుతుందా అని ప్రశ్నించారు. ఏపీలో హౌసింగ్ కు కేవలం వెయ్యి కోట్లిచ్చి పది వేల కోట్లిచ్చినట్లు పచ్చి అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతల తీరు చూస్తుంటే గుడ్డ కాల్చి మీదేసి తుడుచుకోమన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకే బీజేపీ-వైసీపీ-జనసేనలు కలసి టీడీపిపై దృష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో బీజేపీ ఉనికి కూడా ఉండదని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here