సాగర తీరంలో… తండ్రి కలను నెరవేర్చబోతున్న రామ్ చరణ్

ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీకి స్టూడియో లేదు.. దీంతో మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టూడియో కట్టే యోచనలో ఉన్నల్టు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ హైదరాబాద్ శివారులో ఈ స్టూడియో నిర్మాణం ఉంటుంది అని భావించారు… కానీ ఇప్పుడు ఆ స్టూడియోను వైజాగ్ లో నిర్మించే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో సిని నిర్మాణానానికి చెందిన స్టూడియోలు లేవు.. దీంతో ఏపీలో ఫిల్మ్ స్టూడియో కడితే బాగుటుంది అని రామ్ చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. వైజాగ్ లో సాగర తీరం కూడా ఉండడంతో స్టూడియో నిర్మాణం బాగుంటుంది అని చెర్రి అలోచన అట… అంతేకాదు.. చిరంజీవి కి వైజాగ్ అంటే చాలా ప్రత్యేక అభిమానం అని… తాను రిటైర్ ఐన తర్వాత వైజాగ్ లోనే సెటిల్ అవుతానని చెప్పిన సంగతి తెలిసిందే.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి స్టూడియో నిర్మిస్తే… వారి హీరోల సినిమాతోనే ఎప్పుడు బిజిబిజిగా ఉంటుంది అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here