కుచ్చెర్ల కోట రామరాజు గారి : బాలకృష్ణ మోహన పరమ భక్త పాలన

రాగం: మోహన; తాళం: తిశ్ర ఆది

ప. బాలకృష్ణ మోహన పరమ భక్త పాలన
శ్రీ రమణ శౌర్యగణ త్రిలోక పాలన సుగుణ

1. నంద గోప సుకుమార నళిన దళాయతాక్ష హరే

2. సుందరముఖ మందర గిరిధర గోవింద మురహర
బృందావన నివసన బహు పురాణ పురుష రాధ నుత

3. ముని మానస హంస రా మునినుత బహు సంతోష
ఘనాఘన యమునా ప్రియదర్శన అఘ హరణ శరణు

4. సామజ భయ హర మురళీధర సదయ హృదయ
సరసిజనాభమర వినుత రామరాజ హృదయ నివస
వరవేంకట గురు పూజిత పరమార్థ ప్రకృతి రహిత
అమర అపర అచల అజడ అసమ అనఘ అసురహరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here