ఆదేశంలో 2 కిలోల చికెన్ ధర… కోటి 46 లక్షలు

ఒక దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కురుకు పోతే అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. తాజాగా దక్షిణ అమెరికా తీరంలోని వెనిజులా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో వెనిజులలో ద్రవ్యోల్బణనికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో లోకల్ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా పోయింది. పెట్రోల్‌ ఉత్పత్తులు ధరలు క్రాష్‌ కావడంతో మొదలైన సంక్షోభం ఢొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరింది.
అందుబాటులో లేని ధరలతో… జనం తినడానికి తిండి కూడా ఉండడం లేదు. 2.4 కిలోల చికెన్ కొనాలంటే వెనిజులా కరెన్సీ బాలివర్లులో కోటి 46 లక్షల చెల్లించాల్సిందే. చికెన్‌ను లోకల్ కరెన్సీలో కొనాలంటే చిన్న నోట్లలో అంత మొత్తం చెల్లించాలని ఓ దుకాణాదారు డిస్‌ప్లే ఏర్పాటు చేశాడు. మన కరెన్సీలోదాన్నిపోలిస్తే 2.4. కిలోక చికెన్ ధర కేవలం నూటాయాభై రూపాయలే. అదే అమెరికా కరెన్సీలో అయితే అది 2.22 డాలర్లు మాత్రమే. కానీ వెనుజులా లో చిన్నచితకా నోట్లకు విలువ లేకుండా పోవడంతో ప్రస్తుతం అక్కడ ధరలు ప్రజలను బెంబేలు ఎత్తిస్తున్నాయి. ఇక చిన్న నోట్లను జనం చెత్తకుండీల్లో వేస్తున్నారు. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here