బీజేపీ అంటే బ్రోకర్లు-జోకర్లు-పిచ్చోళ్ల పార్టీ: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పోరాడుతుంటే.., కేసుల మాఫీ కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ తో లాలూచీ పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మోదీ-జగన్-పవన్ లు కలసి రాష్ట్ర ప్రజలపై కుట్ర పన్నారని తీవ్రంగా ఆరోపించారు. అసలు బీజేపీ అంటే బ్రోకర్లు-జోకర్లు-పిచ్చోళ్ల పార్టీ అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే రాఫెల్,ఎస్సార్ కుంభకోణాలపై… సిబిఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here