డేరా బాబా బెయిల్ కు సీబీఐ కోర్టు తిరస్కరణ

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. డేరా ఆశ్రమంలో ఇద్దరు సాద్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ సింగ్ కు 20 ఏళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. కాగా తాను ఈ కేసులో ఎప్పుడూ అరెస్ట్ కాలేదనీ.., మరో ఇద్దరు నిందితులు డాక్టర్ పంకజ్ సింగ్, డాక్టర్ ఎంపీ సింగ్ లకు కూడా బెయిల్ ఇచ్చినందున, తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ గుర్మీత్ సింగ్ తన పిటీషన్లో పేర్కొన్నారు. అయినా ఈకేసులో ఇప్పటికే అభియోగాలు నమోదు చేసినందున డేరా బాబాకు బెయిల్ మంజూరు చేయరాదంటూ సీబీఐ వాదించింది. డేరా ఆశ్రమంలో అనుచరులను అక్రమంగా నసంపుకులుగా చేసిన కేసులో డేరా బాబా, పంకజ్ సింగ్, ఎంపీ సింగ్ లు నిందితులుగా ఉన్నారు. మాజీ అనుచరుడు హన్స్ రాజ్ చౌహాన్ ఫిర్యాదు మేరకు.., ఈ వ్యవహారం పై సీబీఐ విచారణ చేపట్టాలని 2014లో హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆల్రెడీ ఇద్దరు సాద్వీలను అత్యాచారం చేసిన కేసులో మరియు మరో రెండు కేసుల్లో డేరా బాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఇవేగాక మరో రెండు హత్య కేసుల్లోనూ డేరా బాబా విచారణ ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here