విజయ్ మాల్యాను ఉంచే సెల్ వీడియో, లండన్ కోర్టుకు సమర్పణ

బ్యాంక్ లకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉంచబోయే జైల్లోని సెల్ వీడియోను, సిబిఐ లండన్ కోర్ట్ ముందుంచింది. ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోని బారక్ నెంబర్ 12కు సంబంధించిన వీడియో అది. విజయ్ మాల్యాను ఉంచబోయే సెల్ లో టీవీ, వెస్టర్న్ టాయిలెట్, బెడ్, వాషింగ్ ఏరియా, బయట తిరిగే ప్రదేశం, తగినంత సూర్యకాంతి.., ఇలా అన్నీ ఉన్నాయని చెప్పేలా ఆ వీడియో తయారు చేశారు. ఆరు నిమిషాల నిడివి గల వీడియో ఇది. ఆ వీడియోలో జైల్లో ఉన్న వసతులను చూపించారు. భారతదేశ జైళ్లలో సూర్యకాంతి పడదని, స్వచ్ఛమైన గాలి లోనికి రాదని విజయ్ మాల్యా ఫిర్యాదు చేయడంతో లండన్ కోర్ట్, భారతదేశ జైలుకు సంబంధించిన వీడియో ఇవ్వాలని భారత అధికారులను ఆదేశించింది. దీంతో సిబిఐ అధికారులు ఈ వీడియోను తయారుచేసి లండన్ కోర్టుకు సమర్పించారు. విజయ్ మాల్యను ఉంచబోయే బారక్ తూర్పుముఖంగా ఉందని, దీంతో సూర్యకాంతి బాగా పడుతుందని కూడా అధికారులు తెలియజేసారు. ఇక భద్రత విషయానికి వస్తే, ఈ జైల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ మధ్యే కేంద్ర హోంశాఖ, ఈ జైల్లో నిర్వహించిన ఆడిట్ రిపోర్టును కూడా లండన్ కోర్టుకు అందజేశారు. ఈ జైల్లో నాలుగుసార్లు ఆహారం ఇస్తారని చెప్పారు. ఆర్థర్ రోడ్డు జైల్లోని బారక్ 12లో హై ప్రొఫైల్ ఉన్న ఖైదీలను ఉంచుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here