ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్., ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరిన కేసీఆర్…, మూడురోజులపాటు అక్కడే ఉండనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎంపీలు వినోద్, సంతోష్, సీఎస్ ఎస్కె జోషి కూడా ఢిల్లీ వెళ్లారు. కాగా ఢిల్లీ పర్యటన అనంతరం ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ స్వయంగా అధికార ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here