జనసేన లోకి 20 మంది ఎమ్మెల్యేలు?

జనసేన పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ కన్వీనర్ పార్థసారథి సంచలన ప్రకటన చేశారు. వారు ఇప్పటికే తమ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు కూడా జరిపారని పార్థసారథి వెల్లడించారు. తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని, తుది నిర్ణయం తీసుకున్న తరువాత వారిని జనసేన పార్టీ లోకి ఆహ్వానిస్తామని పార్థసారథి చెప్పారు. ఆయా పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తెగ తిరిగేస్తున్నారు. కానీ ఆయన పార్టీలో చేరడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఆయా పార్టీల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు కానీ ఎవరూ పవన్ వైపు చూడడం లేదు. రాజకీయంగా నిరుద్యోగంతో ఉన్న ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ ఆయన పార్టీలో చేరడంలేదు. కానీ
.., ఆపార్టీలో ఉన్న చోటా మోటా నేతలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన పార్థసారథి మాటలకు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. పార్టీ కన్వీనర్ పార్థసారథి మాట్లాడుతూ పార్టీలో 60 శాతం నవతరానికి ఇస్తామని చెబుతున్నారు. అంటే పార్టీలో ఎవరూ చేరకపోవడంతో అభిమానుల నుంచి ఎవరు అడిగితే వారికి టిక్కెట్ ఇచ్చేస్తారని… 60 శాతం కాదు 90 శాతం అలాగే ఇచ్చేస్తారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here