నేడు కర్నూలులో టిడిపి ధర్మపోరాటం

ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ… టిడిపి అధినేత ఏపీ సిఎం చంద్రబాబు ధర్మ పోరాటం తలపెట్టిన ధర్మపోరటానికి ఈరోజు కర్నూలు వేదిక కానున్నది.
నిధుల కేటాయింపులో ప్రధాని మోడీ.. ఏపీకి చేస్తున్న అన్యాయం, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు పరచకపోవడం సహా అనేక సమస్యలపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయనున్నారు. దాదాపు లక్ష మందిని సమీకరించి భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వారం రోజుల నుంచి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కడప యోగి వేమన యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటా 45నిమిషాలకు కర్నూలుకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. STBC కాలేజీలో ధర్మపోరాటం సభ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల 5నిమిషాలకు రోడ్డు మార్గంలో ఎస్‌టిబిసి కళాశాలకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 4గంటల 45 నిమిషాల వరకు ధర్మపోరాటం సభలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here