మంత్రుల వ్యాఖ్యలపై చంద్రబాబు దిద్దుబాటు చర్యలు

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు సహా తెలుగుదేశం పార్టీపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై అని, అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ కవలడం ఏంటంటూ మంత్రులు ప్రశ్నించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రుల వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపడంతో సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇద్దరిపైనా సీరియస్ అయ్యారు. ఇష్టానుసారం స్టేట్‌మెంట్లు ఇవ్వడమేంటంటూ మండిపడ్డారు. పొత్తులపై ఇంత వరకు పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని.. అలాంటప్పుడు ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై పొలిట్ బ్యూరోలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారనే విషయం సీనియర్ మంత్రులకు తెలియక పోతే ఎలా అంటూ చురకలంటించారు. పార్టీలో జాతీయ రాజకీయాలపైనే చర్చ జరిగిందని..కాంగ్రెస్ తో పొత్తు విషయంపై ఎవరు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి.. విచక్షణ కోల్పోయి మాట్లాడటం సరికాదని అన్నారు. ఏపీలో 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే టీడీపీ లక్ష్యమని, 25మంది ఎంపీలతో ప్రధాని అభ్యర్ధిని నిర్ణయించే అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నామని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ తీసుకోని నిర్ణయాలపై మంత్రులు స్పందించడం మంచిది కాదని.. మందలించారు. ఇక ముందు పార్టీలో నిర్ణయం జరగకుండా.. ఇలాంటి వాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని నేతలకు హెచ్చరికలు పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here