కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని

కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ బచ్చా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం నల్లేరుమీద నడకే అని ధీమా వ్యక్తంచేశారు. గొర్రెలు, బర్రెలు, పంపిణీ పథకం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామన్నారు. 900 కోట్ల రూపాయలతో 2.13 లక్షల మందికి బర్రెలు, ఆవులు పంపిణీ చేశామని తెలిపారు. కోటి ఎకరాల మాగాణి చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నా.., తమ ప్రాధాన్యత తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here