భర్త విజయాన్ని కోరుతూ భార్య కూడా రాఖీ కట్టవచ్చు తెలుసా..!!

హిందువులకు అనేక పండగలు.. అయినా సరే రాఖీ స్పెషల్ పండగ… సోదర సోదరీమణులు అందరూ ఎంతో ఇష్టం గా చేసుకునే పండగ. ఈ రక్షాబంధన్ కు సంబంధించి అనేక కథలు
ఉన్నాయి. అయితే మనం ఈ పండగ ఎక్కువుగా సోదరి తన సోదరుడుకి రాఖి కట్టి జరుపుకునే పండగగానే భావిస్తాం… కానీ నిజానికి ఈ రాఖి పండగ రోజున భార్యలు తమ భర్తలకు రాఖీ కట్టవచ్చు. అటువంటి కథ ఒకటి పురాణాల్లో ఉంది. పూర్వం రాక్షసులు ఎప్పుడూ దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టేవారు. దాదాపు పుష్కరకాలం పాటు రాక్షసులకు, దేవతలకు యుద్ధం సాగింది. దేవేంద్రుడు నిత్యం వారిపై యుద్దాలు చేసినా ఓడిపోయేవాడు. తన విజయం కోసం దేవేంద్రుడు ఎన్నో పూజలు కూడా చేసేవాడు. శ్రావణపూర్ణమి రోజు ఇంద్రుడికి ఆయన భార్య శచీదేవి రాఖీ కట్టి యుద్దానికి పంపుతుంది. ఆ రక్షాబంధనం వల్ల ఇంద్రుడు విజయం సాధిస్తాడు. అలా భర్తలకు కూడా భార్యలు రాఖీ కట్టే సంప్రదాయం ఒకటి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here