సబ్జాలతో ఆరోగ్యం మన చేతుల్లోనే..!

సహజ పద్దతిలో బరువు కోల్పోవడానికి ఉపయోగించేవి సబ్జాలు. ఇవీ మన ఇంటి చెట్ల పొదలో మొలిచే ఔషధ గుణాలు ఉన్న మొక్క. విత్తనాలన్నింటిలో భలే వింతగా అనిపిస్తాయి ఈ సభ్జాలు… శరీర అధిక బరువును నియంత్రించడంలో ఇదీ ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తుంది. అంతే కాదు నిద్రపోయే ముందు సబ్జా గింజలతో నాన బెట్టిన నీళ్లు తాగితే బాడీకి ఇదీ యాంటీ బాయోటిక్ గా పని చేస్తోంది. ఈ సబ్జా గింజలను వాటర్ లో కలపగానే ఉబ్బి జెల్‌గా సాఫ్ట్‌గా మారిపోతాయి. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండ కాలంలో శరీరానికి చల్లదనం కలిగిస్తుంది సబ్జాగింజలు. ఈ గింజలను మొదట నీళ్లలో నానబెట్టాలి. రెండు మూడు గంటల అనంతరం ఈ గింజలు జెల్ గా ఉబ్బి సాఫ్ట్ గా వైట్ కలర్ లో మారతాయి. అనంతరం వాటిని తాగితే శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తుంది.
డైయబెటిక్స్‌తో బాధపడే వారు ఈ సబ్జా వాటర్‌ను సేవిస్తే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
డీహైడ్రేషన్ రాకుండా బరువు పెరగకుండా ఉండలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ సబ్జా గింజలను వాటర్ లో కలుపుకొని తాగాలి. ముందుగా చెప్పినట్టు పేరుకున్న కొవ్వును పెరగకుండా చేస్తుంది.
బాడీలోని క్యాలరీలను కరిగించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సబ్జా వాటర్ తాగడం వల్ల శరీరంలోని జీర్ణ ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది.
అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది.
సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.
గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తగిన ఫలితం ఉంటుంది.
గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
వీటిలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు దరిచేరవు.
ఈ గింజలు బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి
కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here