కేరళకు 7 కోట్ల విరాళమిచ్చిన ఆపిల్ సంస్ధ

వరదలతో సతమతమవుతున్న కేరళకు., టెక్ కంపెనీ ఆపిల్ సంస్థ 7 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. కేరళ వరదలు తమను విషాదంలోకి నెట్టాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కేరళలో రిలీఫ్ వర్క్ కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఆపిల్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్లు.., విరాళాలు కోరుతూ తమ హోమ్ పేజీలో బ్యానర్ ను పోస్ట్ చేశాయి. జాతీయ విపత్తులు చోటుచేసుకున్నప్పుడు ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆఫ్ స్టోర్స్ ద్వారా విరాళాలను సేకరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here