కేటీఆర్-పవన్ లకు బూతు సాహితీ అవార్డులివ్వాలి: వీహెచ్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బూతు సాహితీ అవార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు వ్యాఖ్యానించారు. లోకేష్ కంటే పవన్ కల్యాణ్ కు ఎక్కువ అనుభవముందా? అని ప్రశ్నించారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ఇప్పటినుండే ఓటమి భయం పట్టుకుందని వీ.హనుమంతరావు ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ మాదిరిగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాట తప్పే రకం కాదన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు అధికారంలోకి రాగానే ముందు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని వీహెచ్ హనుమంతరావు చెప్పారు.
7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here