బీజేపీది స్వార్ధ రాజకీయం: వాజ్ పేయి మేన కోడలు

వాజ్ పేయి చితాభస్మంతో కూడిన కలశాలను అన్ని రాష్ట్రాల్లో నిమజ్జనం చేసేందుకు సిద్ధమైన బీజేపీ, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేత అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు ఈ కలశాలను అంద జేయించింది. దేశంలోని వందకుపైగా నదుల్లో వాజ్ పేయి చితాభస్మాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రధాని మోదీ ఆస్థి కలశ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాజ్ పేయి దత్త పుత్రిక నమిత భట్టాచార్య, కేంద్ర మంత్రులు రాజనాధ్ సింగ్, సుష్మాస్వరాజ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈనెల 19న వాజ్ పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య చేతులమీదుగా హరిద్వార్ లోని హరీ-కా-పౌరీలో చితాభస్మాన్ని నిమజ్జనం చేయడం తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై వాజ్ పేయి మేన కోడలు కరుణ శుక్లా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
మాజీ ప్రధాని వాజ్ పేయి మరణాన్నీ బీజేపీ రాజకీయంగా వాడుకుంటున్నదని, కరుణ శుక్లా తీవ్రంగా ఆరోపించారు. బీజేపీది స్వార్ధ రాజకీయమని,వాజ్ పేయి బ్రతికున్నప్పుడు ఆయన పేరుతో లబ్ధిపొందిందని, ఆయన మరణించినా.., ఇంకా వదలడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాజ్ పేయి చితాభస్మా కలశాలతో బీజేపీ నేతలు ర్యాలీలు నిర్వహించడాన్ని ఆమె తప్పు బట్టారు. వాజ్ పేయి మృతితో ప్రజల్లో నెలకొన్న సానుభూతితో 2019 ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని వాజ్ పేయి మేన కోడలు కరుణ శుక్లా మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here