వైసీపీలో చేరబోతున్న మాజీ డీజీపీ

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. కాగా నండూరి సాంబశివరావు వైసీపీ లో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు మా పార్టీలో చేరడంతో వైసీపీకి ఆదనపు బలమొచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఇటీవలే ఐపీస్ అధికారి ఇక్బాల్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో జగన్మోహన్ రెడ్డిని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. 1984 ఐపీస్ బ్యాచ్ కు చెందిన నండూరి సాంబశివరావు రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఆదిలాబాద్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. నండూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులోని మిరియాలపాలెంకు చెందిన నండూరి రామకోటయ్య-సూరమ్మల దంపతులకు జన్మించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన డీజీపీ స్థాయికి ఎదిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here