మాల్యా ఇండియా విడిచివెళ్లే ముందు బీజేపీ నేతలను కలిశారు: రాహుల్ గాంధీ

వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఇండియా నుంచి విదేశాలకు పారిపోయే ముందు విజయ్ మాల్యా కొందరు బీజేపీ నాయకులను కలిశారని, అది డాక్యుమెంటెడ్ గా ఉందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ పేర్లు నేను చెప్పనని లండన్ ఆడియన్స్ సమక్షంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ బ్యాంకులను మోసం చేసిన బడా వాణిజ్యవేత్తలు సులభంగా దేశం దాటేశారని అన్నారు. విజయ్ మాల్యా మొదలు నగల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్స్పీ వరకూ మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here