ఏపీలో మహిళలకు రక్షణ కరవు: రోజా

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించారని, అత్యాచారాలను మహిళా మంత్రులు ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. టీడీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో పొత్తుకు సిఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారని, పొత్తు లేకుండా ఎన్నికలకు వెళతామని చెప్పే ధైర్యం చంద్రబాబుకి ఉందా అంటూ నిలదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు. సింగపూర్ వెళ్లి పెట్టుబడులు తెస్తారనుకుంటే.., మంత్రులు కట్టుడు పళ్లు పెట్టుకుని వస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here