సెమీస్ కు చేరిన సైనా, సింధు

ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు లు మహిళ సింగిల్స్ సెమీస్ లో ప్రవేశించారు. మొదటగా జరిగిన క్వార్టర్ మ్యాచ్ లో నాలుగో సీడ్ క్రీడాకారిణి, థాయిలాండ్ కు చెందిన రట్చనాక్ పై వరుస గేమ్ ల్లో 21-18, 21-16 తేడాతో సైనా నెహ్వాల్ గెలిచి సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసుకుంది. తర్వాత జరిగిన మరో క్వార్టర్ మ్యాచ్ లో పీవీ సింధు థాయిలాండ్ కే చెందిన జిందాపోల్ పై 21-11, 16-21, 21-14 తేడాతో గెలిచి సెమీస్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. మొదటి గేమ్ లో దూకుడుగా ఆడి ఈజీగా గెలిచిన సింధు, రెండో గేమ్ లో కొన్ని తప్పిదాల వల్ల ఆ సెట్ 16–21తో కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ లో తనదైన శైలిలో విజృంభించి 21-14 తో గెలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here