టీడీపీతో పొత్తు, కాంగ్రెస్ కు తీవ్రనష్టం: విజయశాంతి

తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు వ్యవహారం రెండు పార్టీలలోనూ దుమారం రేపుతున్నట్లు కనపడుతుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ విజయశాంతి ఈ పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలుగుతుందని విజయశాంతి అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్-టీడీపీ ఇప్పటివరకు ప్రత్యర్ధులుగా ఉన్నాయని, ఇపుడు రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని విజయశాంతి చెబుతున్నారు. రాహుల్ గాంధీని పార్టీలో కొందరు తప్పు దోవ పట్టిస్తున్నారని కూడా ఆమె అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తో పొత్తు పెట్టుకొంటే కాంగ్రెస్ కి తీవ్ర నష్టం తప్పదని విజయశాంతి స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here