బిగ్ బాస్ హౌజ్ నుంచి నాని ఎలిమినేట్… కానీ..!!

మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో షాకింగ్ వార్త చోటుచేసుకుంది.. ఈ వారం పూజ తో పాటు.. బిగ్ బాస్ హౌస్ నుంచి నటుడు నాని ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో రాఖీ పండగ సందర్భంగా ప్రసారం చేసిన స్పెషల్ ఎపిసోడ్ అదిరింది. హోస్ట్ నాని.. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యి సందడి చేశాడు.. హౌస్ లో ఉన్న సభ్యులతో రాఖి పండగ జరుపుకున్నాడు.. తనకు రాఖీ కట్టిన మహిళా సభ్యులకు కానుకగా చీరలను అందించాడు. ఇక రాఖీ సందర్భంగా ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను సభ్యులకు నాని స్వయంగా చదివి వినిపించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో సభ్యులపై జరుగుతున్న ప్రచార వీడియోలను చూపించి అటు కంటెస్టెంట్ లకు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఇక నాని తన ఇంటి నుంచి తీసుకు వచ్చిన ఆహారాన్ని ఇంటి సభ్యులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశాడు.. సీజన్ 1 లో ఎన్టీఆర్ స్వయంగా వంట చేసి సంగతి తెలిసిందే.. చివరగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది.. మొదట పూజ అని చెప్పి… అనంతరం తాను కూడా పూజ తో పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు ఇంటి నుంచి బయటకు వచ్చారు.. ఐతే నాని ఎలిమినేట్ అయ్యింది.. బిగ్ బాస్ హౌస్ నుంచి మాత్రమే.. షో నుంచి కాదు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here