తేళ్ళ నైవేద్యం… అక్కడ గుడిలో ప్రత్యేకం..

శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైన మాసం.. ఇక శ్రావణ సోమవారాలు శివుడిని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజిస్తారు.. భోళాశంకరుడికి ప్రత్యెక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇక శివుడికి టెంకాయ, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కర్నూలు జిల్లాలోకి కొండలరాయుడుకి తేళ్ళను నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రావణమాసం మూడో సోమవారం వచ్చిందంటే కోడుమూరు కొండపై సందడే సందడి. భక్తులు విషపురుగులైన తేళ్ల కోసం కొండపై వెతుకుతారు. చిన్న, చిన్న రాళ్లను ఎత్తి ఎలాంటి జంకుబొంకులేకుండా తేళ్లను చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఆచారం దశాబ్దాలుగా వస్తోంది. ఇలా తేళ్ళను నైవేద్యంగా పెట్టడానికి అక్కడ స్థానికులు ఒక కథను చెబుతారు. పూర్వం కోడుమూరులో సౌరెడ్డి, అన్నపూర్ణ దంపతులు ఉండేవారు. వరుసగా వారికి ఆడ సంతానమే కలిగింది. దీంతో వారు మగ సంతానం కలిగితే తేళ్లతో నైవేద్యం పెడ్తామని కొండలరాయుడికి మొక్కుకున్నారట. ఆ తర్వాత సౌరెడ్డి దంపతులకు మగబిడ్డ పుట్టారు. దీంతో వారు తేళ్లు నైవేద్యం సమర్పించి మొక్కు చెల్లించకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే మూడో సోమవారం కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here