శ్రావణ మంగళవారం ఆచరించాల్సిన పూజా విధానం..కలిగే ఫలితాలు

శ్రావణ మంగళ వారం చాల ప్రత్యేకం.. ఈ రోజు ఆచరించాల్సిన పూజ విధానం గురించి తెలుసుకుందాం… శ్రావణ మంగళవారం రోజున శివుడు, హనుమంతుడు ఉన్న ఆలయాలకు వెళ్లి ఆ రోజు హనుమంతునికి పంచోపచార పూజ చేస్తే మంచిది. మర్రి ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి హనుమ విగ్రహం ముందు కొద్ది సేపు ఉంచి దేవునికి పెట్టే తిలకంతో ఆ ఆకు మీద ‘శ్రీరామ్’ అని రాసి దాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే మంచిది. మరుసటి ఏడాది పాత ఆకుని పారే నదిలో వదిలి మరో కొత్త ఆకుమీద ఇలానే రాసి ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు.
అలాగే శ్రావణ మంగళవారం రోజు రామస్త్రోత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవునికి బెల్లం మరియు వేయించిన శనగలు నైవేధ్యంగా సమర్పించాలి. దేవుని ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆపై శివ చాలిసా, హనుమాన్ చాలిసాలను భక్తి, శ్రద్ధలతో పఠించాలి. ఇలా చేయడం వలన అభిషేక ప్రియుడైన శివుడు, చాలీసా పటిస్తేనే సంతప్తి చెందే హనుమ ఆశీర్వచనాలు పుష్కలంగా లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here