కె. రాఘవేంద్రరావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

సినీ డైరెక్టర్, ఎస్వీబీసీ చైర్మన్ కె.రాఘవేంద్రరావు కు తృటిలో ప్రమాదం తప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన ర్యాలీ లోని స్కార్పియో వాహనం అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ సంఘటన లో డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో రాఘవేంద్రరావు ఆ వాహనంలో లేరని, వెనుక మరో వాహనంలో ఉన్నారని సమాచారం అందుతోంది. కొద్దిలో ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో ఉన్నవారు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here