కేసీఆర్ ఆవేదన సభ :రేవంత్ రెడ్డి

ముందస్తు ఎన్నికలపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు తామేమీ బయపడటంలేదని, ముందస్తుకు వెళితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులు ఆగిపోతే అంచనా వ్యయాలు పెరిగిపోయి తిరిగి ప్రజాలపైనే భారం పడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. భాద్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే గత ఏడాది ఓటర్ల జాబితా ప్రకారమే వెళ్లాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రగతి నివేదన సభపైన కూడా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి నివేదన సభ అనేకంటే.. “కేసీఆర్ ఆవేదన సభ ” అని పెట్టుకోండని ఎద్దేవా చేశారు.టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here