నాకు తను భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం : చినబాబు

అపర రాజకీయ చాణుక్యుడు ఏపీ సిఎం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారసుడు గా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఏపీ ఐటి మంత్రిగా పదవిని అలంకరించిన నారా లోకేష్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. అయితే అది వృత్తి గతంగానే కానీ.. వ్యక్తీ గతంగా మాత్రం కాదు… సోషల్ మీడియా లో కూడా నారా లోకేష్ రాజకీయానికి సంబంధించిన ట్విట్ మాత్రమే పెడుతుంటారు. కాగా తాజాగా లోకేష్ చేసిన ఒక ట్విట్ వైరల్ గా మారింది.. సిని నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో నారా లోకేష్ పెళ్లి జరిగి 11 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో తామిద్దరూ ఉన్న ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసి… గడచిన 11 ఏళ్లుగా ప్రేమ, ఆప్యాయతలను నిరంతరం అందిస్తున్న బ్రాహ్మణి… తనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పాడు. అందుకు భగవంతుడికి గొప్ప కృతజ్ఞలు కూడా తెలియజేశాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ లోకేష్ తన భార్య కు శుభాకాంక్షలు తెలుపుతూ.. తాము జంటగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశాడు.. ఈ ట్విట్ కు, ఫోటో కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here