జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా…వాజ్ పేయికి అంకితం

ఆసియా క్రీడల్లో భారత్ ఆథ్లెటిక్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా ఆసియా క్రీడల ప్రారంభవేడుకల్లో భారత్ కు ఫ్లాగ్ బెరర్ గా వ్యవహరించాడు. ఆట ఆరంభం నుంచే నీరజ్ చోప్రా అందరికన్నా ఆధిక్యంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే 83.46 మీటర్లు జావెలిన్ ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. రెండోసారి విఫలమయ్యాడు.మూడో ప్రయత్నంలో ఏకంగా 88.06 మీటర్లు విసిరి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచాడు. చైనా ఆటగాడు ల్యూ క్విజాన్ 82.22 మీటర్లతో రజతం, పాక్ ఆటగాడు నదీమ్ అర్షద్ 80.75 మీటర్లతో కాంస్యం అందుకున్నారు. ఆసియా క్రీడల్లో జావెలిన్ విభాగంలో భారత్ కు ఇది తొలి పతకం. అయితే ఈ విజయం కోసం తానేంతో కృషి చేశానని నీరజ్ చోప్రా పేర్కొన్నారు. నా దృష్టి మొత్తం దేశానికి స్వర్ణ పతకం సాధించడంపైనే ఉంది. ఈ స్వర్ణ పతాకాన్ని భారతదేశ మహానేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి అంకితం ఇస్తున్నానని నీరజ్ చోప్రా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here