ఆ సన్యాసి పేరు చెప్పితే.. రాయి పైకి లేస్తుందట…!!

పైన ఉన్న వస్తువు కింద పడుతుంది.. ఎందుకంటే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలన.. కానీ ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ.. ఆశ్చర్యం గిలిపే వింత ప్రదేశాలు మనదేశంలో ఉన్నాయి. అవి ఎక్కడో తెలుసా.. మహాబలిపురం, రామసేతు వద్ద సముద్రం, పుణెలోని దర్గా, మణిపూర్ అవును ఈ ప్రదేశాల్లో గాల్లో తేలియాడే రాళ్ళు ఉండి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న వింత ప్రదేశాలుగా పేరుపొందాయి.

ప్రపంచంలోనే కాదు.. మనదేశంలో కూడా అనేక వింత ప్రదేశాలు ఉన్నాయి.. మనిషి మేథస్సుకు అందని వింతలుగొలుపుతున్నాయి. అటువంటి ప్రదేశంలో ఒకటి మహారాష్ట్రలోని పూణేలో ఉంది. పూణేలో ఉన్న హజ్రత్ కమర్ అలీదర్వేష్ దర్గాలో ఒక రాయి ఉంటుంది.. ఈ రాయి 70 కిలోల బరువు వుంటుంది.. కాగా ఈ రాయికి 800 ఏళ్ల క్రితం కమర్ అలీ అనే సన్యాసి శాపం ఇచ్చాడట.. అప్పటి నుంచి ఈ రాయిని ఎత్తాలంటే.. అతని పేరు చెప్పాల్సిందే అని అక్కడ భక్తులు చెబుతారు. అయితే ఇలా ఈ రాయిని పైకి ఎత్తడానికి 11 మంది భక్తులు ఉండాలి.. వారు రాయి చుట్టూ నిలబడి.. వారి చూపుడు వేళ్ళను ఆ రాయి పై పెట్టి.. ఋషి పేరు చెబితే చాలు ఆ రాయి గాల్లోకి అమాంతంగా లేస్తుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here