పవన్ రాజకీయ భవిష్యత్ పై సుమన్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటుడు సుమన్ తనకు రాజకీయా రంగం ప్రవేశం గురించి ప్రస్తావించారు. ఇటీవల సుమన్ సినిమాల్లోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సుమన్ మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశం గురించి జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాన్ వంటి యువ నేత సమాజానికి ఉపయోగపడే సరికొత్త ఆలోచనలతో సరికొత్త పంథాను ఏర్పరచుకుని ప్రజల ముందుకు రావాలి. పవన్ ప్రస్తావించిన సమస్యల గురించి గతంలో ఇతర నేతలు ఎందుకు మాట్లాడలేదు..? ఎందుకు ఆ సమస్యలను తీర్చే ప్రయత్నం చేయలేదు. పవన్ రాజకీయ ప్రయాణం కుల మతాలకు అతీతంగా సాగుతుంది. అని సుమన్ చెప్పారు. అయితే తనకు ఆయన రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారు అనే విషయం గురించి మాత్రం అంచనాలేదు.. ఆయన రాజకీయ భవిష్యత్ నాకు తెలియదు… కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగానికి యువత బాగా ఆకర్షితులవుతున్నారు… అన్ని ఆదర్శంగా తీసుకుని నడిచే ప్రయత్నం చేస్తున్నారు అని సుమన్ జనసేన అధినేత పవన్ రాజకీయ భవిష్యత్ పై స్పందించారు. సుమన్ తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ తో పాటు.. హాలీవుడ్ లో డెత్‌ అండ్ ట్యాక్సీ అనే సినిమాను కూడా చేశారు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి… తెలుగులో ఇప్పటి వరకూ 99 సినిమాలను పూర్తీ చేసి 100 వ సినిమా గా హీరోగా చేయాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here