వెండి తెరపై సంచలన హీరో బయోపిక్ కు రంగం సిద్ధం..

టాలీవుడ్ మహానటి సినిమా సక్సెస్ తర్వాత బయోపిక ల హవా మొదలైంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ లు షూటింగ్ జరుపుకుంటుండగా… తాజాగా మరో బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుంది. హీరో సుదీర్ బాబు… సూపర్ స్టార్ క్రిష్ణ బయోపిక్ త్వరలో తెరకేక్కనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. సినీ పరిశ్రమలో హీరో కృష్ణది ఒక స్పెషల్ పేజీ.. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా ఇలా అనేక రంగంల్లో కృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు.. అంతేకాదు.. వ్యక్తి గత జీవితంలో రెండు పెళ్ళిళ్ళు… రాజకీయ రంగంలో ప్రవేశం… టిడిపి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ తో క్రిష్ణ విబేధాలు ఇవన్ని వెండి తెరపై చూపిస్తారా… అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 300 లకు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ జీవితంలో మరచిపోని అనేక జ్ఞాపకాలు.. ఎన్టీఅర్, నాగేశ్వర రావు, శోభన్ బాబు, చిరంజీవి ఇలా అనేక మందితో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. మరి ఆయన జీవితం రెండు గంటల్లో తెరకెక్కించడం ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.. అటువంటి సవాల్ ను స్వీకరించే దర్శకుడు.. కృష్ణలా నటించే హీరో ఎవరో సుదీర్ బాబు చెప్పేంత వరకూ ఎదురు చూడాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here