టిఆర్ఎస్ మేనిఫెస్టో నా ఆలోచనలే-నన్ను గుర్తించండి: మధుబాబు

నన్ను గుర్తించండి మహాప్రభో… నా జ్ఞానాన్ని నలుగురికీ తెలిసేలా చెయ్యండి సారూ.. అంటూ మధుబాబు వల్లబదాస్ అనే వ్యక్తి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఫేస్ బుక్ కు ఎక్కి తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. 2014కు ముందు నేను కె.చంద్రశేఖరరావు గారికి కొన్ని సూచనలతో ఓ ప్రతిపాదన సమర్పించాను. నా ప్రతిపాదనలోని ప్రధానాంశాలన్నింటితో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకుంది. వాటినే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.ముందు రాబోయే రోజుల్లో కూడా అవే అంశాలతో టిఆర్ఎస్ ముందుకు పోనుంది… అని అంటున్నాడు. ప్రభుత్వం తన ఆలోచనలను తెలంగాణ అభివృద్ధిలో ఉపయోగించుకుందిగనక, తన పేరును “ప్రగతి నివేదన” సభలో బహిర్గతం చేయాలని కోరాడు. ‘నా జ్ఞానాన్ని గుర్తించి, నలుగురికీ తెలిసేలా చెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్ధిస్తున్నాను’ అని మధుబాబు వల్లబ్ దాస్ తన ఫేస్ బుక్ లో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫేస్ బుక్ సాక్షిగా చాలామంది అతనకు మద్దతుగా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here