వంటల్లోనే కాదు.. అనేక రకాలుగా ఉపయోగపడే బేకింగ్ సోడా..!!

తినే సోడా లేదా బేకింగ్ సోడా ప్రయోగశాలలో తయారుచేయగలినా ప్రకృతిసిద్ధంగా కూడా దొరుకుతుంది. ఇలా ప్రకృతి లో దొరికే బేకింగ్ సోడాను నాకొలైట్ అని అంటారు. ఈ బేకింగ్ సోడాను ఎక్కువుగా బేకరీ ఉత్పత్తులైన స్వీట్స్, కేక్స్ వంటి వాటిల్లో ఉపయోగించినా… ఇంట్లో మాత్రం తక్కువుగానే ఉపయోగిస్తారు. అయితే ఈ బేకింగ్ సోడా కేవలం వంటల్లో మాత్రమే కాదు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలను నివారిస్తుందంటున్నారు ఆహార నిపుణులు.

*ఒక స్పూన్ బేకింగ్ సోడాను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
*జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నివారణకు కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కలిపి తాగితే కడుపులో గ్యాస్ తగ్గి పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది.
*రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి దానికి తగినంత నిమ్మరసం చేర్చి పరగడుపున తాగాలి. అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా కొంత కాలం చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.
*పొట్టలో మంట లేక అస్వస్థతగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు.
*శరీరం పై ఏదైనా పురుగు పాకినా, లేదా కుట్టినా ఆ ప్రాంతంలో దురద, నొప్పి, మంట వంటివి వుంటాయి. దీన్ని తొలగించుకోవడానికి కూడా బేకింగ్ పౌడర్ పని చేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి. నిదానంగా నొప్పి, మంట అన్నీ తగ్గుముఖం పడతాయి.
*కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి వారినుంచి దుర్వాసన వస్తుంటుంది. బేకింగ్, నీళ్లు కలిపిన మిశ్రమంలో కాటన్ బాల్ వుంచి చెమట ఎక్కువగా పట్టే ప్రాంతంలో అప్లై చేస్తే దుర్వాసన దూరమవుతుంది.
*స్నానం చేసే నీళ్లలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
*అంతే కాకుండా ఈ మిశ్రమం మంచి హాడ్ వాష్‌గా కూడా పనిచేస్తుంది. చేతుల మురికిని తొలగించి చక్కగా శుభ్రపడతాయి.
*ఇక కూరగాయలు, పళ్ళు వంటి మీద ఉండే పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి.
*మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీసి తరువాత దానిని శుభ్రంగా కడిగి వండుకుంటే… మృదువైన, రుచికరమైన మాంసం కూర రెడీ అవుతుంది.
*టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి.
* ఫర్నిచర్ మీద పెన్సిల్ గీతలు, క్రేయాన్ మరకలు, సిరా మరకలు పడితే… తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి.
*ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే మంచి వాసన వస్తుంది.
* ఫ్రిజ్ ను ఈజీగా శుభ్రం చేయాలంటే తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే సరి. ఇక ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టాలంటే… ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచాలి.
* కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే ఈజీ శుభ్రపడుతుంది
* దువ్వెనలు మురికిగా ఉన్నాయా వెంటనే కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో ఆ దువ్వెన వేసి కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే ఈజీగా మురికి పోతుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here