మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని వుంది: మోహన్ బాబు

డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని వుంది అని ప్రముఖ నటుడు, హీరో మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం కోయంబత్తూరులో స్టాలిన్ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్టాలిన్ మోహన్ బాబు ని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోయంబత్తూరులో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభకు నన్ను ఆహ్వానించినందుకు నా సోదరుడు స్టాలిన్ కు ధన్యవాదాలు. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. త్వరలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తానని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేస్తూ స్టాలిన్ తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here