గురువుగారికి ఖరీదైన బహుమతి ఇచ్చిన చిరు

మెగా స్టార్ చిరంజీవి అందరితోను మంచి స్నేహ బంధాలను కలిగి ఉంటారు.. ఇక చిరంజీవి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లకు మధ్య దాదాపు 35 ఏళ్ళుగా మంచి స్నేహం ఉంది. ఇరు కుటుంబాల మధ్య కూడా స్నేహ వాతావరణం ఉంది.. దీంతో ఇద్దరు వీలైనప్పుడల్లా కలుసుకున్తూనే ఉంటారు.. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అమితాబ్ బచ్చన్ చాలా సార్లు , చాలా సందర్భాల్లో రి ఎంట్రీ ఇవ్వాలని కోరాడు. ఇక తాజాగా చిరంజీవి తాజా సినిమా సైరా లో కీలక పాత్రలో చిరంజీవి తో అనుబంధం కారణంతోనే నటిస్తున్నాడు. స్వాతంత్ర్య తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబందించిన చిత్రీకరణ పూర్తీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం చిరంజీవి తో ఉన్న సాన్నిహిత్యమే అని అమితాబ్ చెప్పారు.. అంతేకాదు.. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నందున రెమ్యునరేషన్ కూడా తిరస్కరించినట్లు చిత్ర యూనిట్ సభ్యుల టాక్.. డబ్బులు తీసుకుని అతిధి పాత్రలో నటిస్తే… తమ స్నేహంను తక్కువ చేసుకోవడమే అని భావించిన అమితాబ్ పారితోషకంను సున్నితంగా వద్దన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో చిరంజీవి ఒక పార్టీ ఇచ్చి… ఖరీదైన బహుమతి ఇచ్చి సాగనంపినట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోన్న సమాచారం. ఈ బహుమతి మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అని చిరంజీవి ప్రేమను కాదనలేక.. అమితాబ్ తప్పని సరి పరిస్థితిలో ఈ బహుమతి తీసుకున్నట్లు టాక్.. బహుభాషా సినిమాగా అత్యంత భారీ కాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. చిరంజీవి పుట్టిన రోజు కనుక గా రిలీజైన సైరా టీజర్ యూట్యుబ్ లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here