సైరా సెట్స్ పై బాలయ్య సందడి..?

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహా రెడ్డి షూటింగ్ హైదరాబాద్ నగర శివారు లో శరవేగంగా జరుపుకుంటున్నది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, నయన తార, విజయ్ సేతు పతి, జగపతి బాబు, తమన్నా, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైరా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష సెట్స్ కు వెళ్లి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ సినిమా కూడా హైదరాబాదు నగర శివారులో అదే ప్రాంతంలో జరుగుతుంది. సైరా కూడా ఆ పక్కనే జరుగుతుందని తెలుసుకున్న బాలకృష్ణ సడన్ గా సైరా సెట్స్ కు వెళ్లి సందడి చేశాడు. బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు దాదాపు ఒక గంట వరకు గడిపినట్లు… ఒకటి రెండు షాట్స్ ను బాలకృష్ణ దగ్గర ఉండి చూసినల్టు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే బాలయ్య చిరు కు సంబంధించిన ఫోటో ఇంకా బయటకు రాలేదు. మరి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చిత్ర యూనిట్ ఈ ఫోటోలను రిలీజ్ చేస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here