విషం ఉన్న పాము కంటే.. విషం లేని పాము ప్రాణ హానికరమా..!!

ప్రకృతిలో ఉన్న జీవుల్లో పాములు కూడా ఒకటి. ఈ పాములు 2,900 జాతులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పాముల్లో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు. పాశ్చాత్య సాంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతుండగా…. భారతదేశంలో రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు. ఇక 50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.
పాము అనగానే అందరికీ భయం.. కానీ నిజానికి పాము మన శత్రువు కాదు.. తన ఆత్మరక్షణ కోసం మాత్రమే విధిలేని పరిస్థితుల్లో కాటు వేస్తుంది.. అందుకనే పాము బారిన పడకుండా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఒకవేళ పాము కాటుకి గురైతే.. తక్షణమే సమీప ఆస్పత్రికి వెళ్ళి చికిత్స తీసుకోవాలి.. పాము కాటు వేసిందంటే.. ప్రాణం పోయిందనే అపోహ ఎక్కువ.. పాముల్లో చాలా రకాలున్నా.. ప్రధానంగా రెండు జాతులు విభజించవచ్చు… విషం ఉన్న పాములు… విషం లేని పాములు.. నిజానికి విషం ఉన్న సర్పాలకంటే.. విషం లేని పాములు కలిగించే ప్రమాదాలే ఎక్కువ. విష సర్పం కరచిన తర్వాత చికిత్స కు ఆలస్యం చేయడం వలన కొందరు మరణిస్తుంటే.. మరికొందరు విషయం లేని పాము కరచినా.. కంగారుతో.. భయంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
అన్ని పాము కాట్లు ప్రమాద కరమైనవి కాకపోవచ్చు.. సర్వసాధారణంగా 50శాతం పాము కాట్లు విషం లేని, ప్రమాదం లేని గాయాలే…వీటికి సాధారణ చికిత్స తీసుకొంటే నయం అవుతుంది.
పాము కరవగానే….
1* భయాందోళనకు గురికావద్దు… భయం పెరిగితే.. రక్త ప్రసరణ పెరిగి విషం త్వరగా శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.. అందుకని పాము కరచిన వ్యక్తికి ఆందోళన వద్దు అని దైర్యం చెప్పాలి..
2* కరచిన పాము విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి.. అపుడు మరింత ఈజీగా చికిత్స అందించవచ్చు…
3* మంత్రాలు.. నాటు వైద్యం ను ఆశ్రయించకుండా.. త్వరగా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తే.. మంచిది.. ఐతే.. పాము కరచిన వ్యక్తిని నడిపించరాదు..
4* పాము కాటువేయగానే విషయం వచ్చేస్తుంది అని.. కాటు వేసిన ప్లేస్ లో కత్తితో.. బ్లేడ్ తో గాటు పెడతారు.. అలాంటి వస్తువులతో గాయం చేయడం ఒక్కొక్కసారి ప్రమాదంగా మరవచ్చు…
5* అందుకని శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడం మంచిది.
6* కొందరు సినిమాల్లో చూపించినట్లు పాము కరచిన ప్లేస్ లో నోటితో విషం పీల్చేశాము అని అంటారు.. ఒక్క సారి పాము కాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు గుండెకు చేరుకుంటుంది. కనుక పాముకరచిన వ్యక్తికి చికిత్స అందించడం ప్రాణాపాయ స్థితిని తప్పించడమే.. అని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము కాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here