తైజు గండాన్ని దాటని సింధు ..రజతంతో సరి..

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది. స్వర్ణం కోసం మంగళవారం తైజు యింగ్ తో జరిగిన పోటీ లో సింధు 13-21, 16-21 తేడాతో ఓడిపోయింది. ఈ సరైనా సింధు ఫైనల్ లో గెలిచి తొలిసారిగా బ్యాడ్మింటన్ లో బంగారు పతకం అందిస్తుంది అని ఎదురు చూసిన భారత క్రీడాభిమానులను నిరాసపరిచింది. రజతంతో సరిపెట్టుకుంది. దీంతో అభిమానులు సింధూకి ఈ ఫైనల్ గండం ఎప్పుడు దాటుతుంది.. స్వర్ణం ఎప్పుడు దక్కించుకుంటుంది అని నిరాశను వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇప్పటికే సైనా నెహ్వాల్ కాంస్యం తెలిచిన సంగతి తెలిసిందే.. దీంతో మహిళా బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజతం, కాంస్యం ను దక్కించుకున్నట్లు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here